నీతా అంబానీ వాడే ఫోన్ ఖరీదు ₹315 కోట్లు, అందులో ఏముందో తెలుసా?
September 20, 2025

భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన విలాసవంతమైన జీవనశైలికి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఇటీవల ఆమె ఉపయోగిస్తున్న ఒక ప్రత్యేకమైన, అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్ గురించి సంచలన విషయం బయటపడింది.
రిపోర్ట్ ప్రకారం, నీతా అంబానీ ‘ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్-6 పింక్ డైమండ్’ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. దీని ధర దాదాపు $48.5 మిలియన్లు, భారతీయ కరెన్సీలో సుమారు ₹315 కోట్లు. 2014లో విడుదలైన ఈ ఫోన్ 24 క్యారెట్ల బంగారం, ప్లాటినం మరియు ఒక పెద్ద పింక్ డైమండ్‌తో తయారు చేయబడింది. దీని అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, దీన్ని హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం.