నవంబర్‌లో షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి రానున్నారా కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ కీలక పరిణామాలు

నవంబర్‌లో షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి రానున్నారా కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ కీలక పరిణామాలు

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ ఘనవిజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవడంతో అక్కడి రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాది నవంబర్ నాటికి తిరిగి దేశానికి వస్తారని అవామీ లీగ్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు విధించిన మరణశిక్ష ప్రస్తుతం ఆమె స్వదేశీ పునరాగమనానికి అతిపెద్ద చట్టపరమైన అడ్డంకిగా మారింది.

తీవ్రవాద భావజాలం ఉన్న జమాతే ఇస్లామీ కంటే బీఎన్పీ అధికారంలోకి రావడం రాజకీయ స్థిరత్వానికి మంచిదని అవామీ లీగ్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో బీఎన్పీ 213 సీట్లు గెలుచుకోగా జమాత్ 76 సీట్లు సాధించింది. భారత్‌లో తలదాచుకున్న హసీనాను రప్పించేందుకు కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *