నగర నీటి కష్టాలు తీర్చేందుకు ఏకంగా 21 కేజీల బంగారం విరాళం
February 23, 2026

జపాన్‌లోని ఒసాకా నగర నీటి సరఫరా మరియు మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించేందుకు ఒక అజ్ఞాత దాత ఏకంగా 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. సుమారు 33 కోట్ల రూపాయల విలువైన ఈ బంగారాన్ని నగరం ఎదుర్కొంటున్న పైపులైన్ల లీకేజీ సమస్యలను పరిష్కరించేందుకు మరియు పాత మౌలిక సదుపాయాలను బాగు చేసేందుకు ఉపయోగించనున్నారు.
సుమారు 60 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వ్యవస్థ ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో 2024లోనే వందకు పైగా ఫిర్యాదులు అందాయి. 30 లక్షల జనాభా ఉన్న ఈ నగర క్షేమం కోసం ఆ దాత చూపిన దాతృత్వంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.