‘దయ్యం వదిలిస్తానని’ బాలిక బట్టలు విప్పి తాంత్రికుడి అసభ్యకర చర్యలు, నిందితుడి కోసం గాలింపు
November 24, 2025

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో 12 ఏళ్ల బాలికపై మూఢనమ్మకాల పేరుతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నెపంతో మధ్యప్రదేశ్‌లోని నివారికి చెందిన హర్భజన్ అనే తాంత్రికుడిని కుటుంబ సభ్యులు పిలిపించారు. ఈ తాంత్రికుడు బాలికను ఒక మూసి ఉన్న గదిలోకి తీసుకెళ్లి, ‘దెయ్యం ఆవహించింద’ని భయపెట్టి, ఆమె దుస్తులు మొత్తం తీయించాడు.
ఆ తర్వాత నిమ్మకాయను ఒళ్లంతా రుద్దుతూ బాలికతో అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డాడు. బాలిక అరుపులు విని కుటుంబ సభ్యులు గదిలోకి రాగానే, తాంత్రికుడు మరో తలుపు గుండా పారిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు బరువాసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హర్భజన్‌పై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.