తారకరత్న వర్ధంతి వేళ విజయసాయిరెడ్డి భావోద్వేగం.. ఆ జ్ఞాపకాలు మర్చిపోలేమంటూ ట్వీట్

తారకరత్న వర్ధంతి వేళ విజయసాయిరెడ్డి భావోద్వేగం.. ఆ జ్ఞాపకాలు మర్చిపోలేమంటూ ట్వీట్

నందమూరి వారసుడు, టాలీవుడ్ నటుడు తారకరత్న మనల్ని వదిలి వెళ్లి నేటికి మూడేళ్లు. ఆయన మూడవ వర్ధంతి సందర్భంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా అత్యంత భావోద్వేగంతో స్పందించారు. తారకరత్న మరణం కలిగించిన లోతైన విచారం, ఆ సమయంలో తలెత్తిన నిశ్శబ్దం తనకు ఇప్పటికీ గుర్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

తారకరత్న ఎంతో ఆప్యాయత, వినయం, అంకితభావం కలిగిన వ్యక్తి అని కొనియాడిన సాయిరెడ్డి.. ఆయన చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్నను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటామని, ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ గుండెల్లోనే ఉంటాయని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

నందమూరి మోహనకృష్ణ కుమారుడైన తారకరత్న, ఒకేసారి 9 సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు. 2023లో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 39 ఏళ్ల చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి విజయసాయిరెడ్డి దగ్గరి బంధువు కావడంతో, ఆయన మరణ సమయం నుండి ఆ కుటుంబానికి సాయిరెడ్డి అండగా నిలుస్తూ వస్తున్నారు.

నేడు సోషల్ మీడియాలో తారకరత్న అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *