తాజ్ మహల్ అందాలకు మురికి నీటి మచ్చ! యమునా నది కాలుష్యాన్ని చూసి విదేశీ పర్యాటక మహిళ వాంతి

తాజ్ మహల్ అందాలకు మురికి నీటి మచ్చ! యమునా నది కాలుష్యాన్ని చూసి విదేశీ పర్యాటక మహిళ వాంతి

ప్రేమ చిహ్నమైన తాజ్ మహల్ అందాలను చూసేందుకు వచ్చిన లిసిప్రియా అనే విదేశీ పర్యాటక మహిళకు ఘోరమైన అనుభవం ఎదురైంది. తాజ్ మహల్ వెనుక ప్రవహించే యమునా నది మరియు దసరా ఘాట్ వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని చూసి ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నదీ తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, కాలుష్యం నుండి వచ్చిన దుర్వాసన భరించలేక ఆమె వాంతులు చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ వింత పక్కనే ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం ఉండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వీడియో పర్యాటక రంగంలో సంచలనం సృష్టించింది. మురికి కాలువలు నేరుగా యమునా నదిలో కలవడం వల్ల తాజ్ మహల్ వెనుక భాగంలో కాలుష్యం పెరిగిపోతోంది. గతంలో కూడా పలువురు విదేశీ పర్యాటకులు ఇక్కడి అపరిశుభ్రతపై ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. లిసిప్రియా చేసిన ఈ వీడియో వైరల్ కావడంతో, తాజ్ మహల్ పరిసరాల పరిశుభ్రత మరియు యమునా నది పునరుద్ధరణపై మరోసారి చర్చ మొదలైంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *