ఢిల్లీ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ సంచలన చర్య ఫిదాయీ దాడికి సిద్ధమైన ఉగ్రవాది అరెస్ట్

ఢిల్లీ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ సంచలన చర్య ఫిదాయీ దాడికి సిద్ధమైన ఉగ్రవాది అరెస్ట్

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారీ విజయాన్ని సాధించింది. ఈ కుట్రలో కీలక నిందితుడైన షోపియాన్‌కు చెందిన యాసిర్ అహ్మద్ దార్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆత్మాహుతి (ఫిదాయీ) దాడికి పాల్పడతానని ప్రమాణం చేసినట్లు విచారణలో తేలింది.

ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. యాసిర్ ప్రధాన నిందితులతో నిరంతరం సంబంధాలు కలిగి ఉన్నాడని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ దారుణ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *