డ్రాగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న భారత్ ఫ్రాన్స్ రక్షణ ఒప్పందాలు

డ్రాగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న భారత్ ఫ్రాన్స్ రక్షణ ఒప్పందాలు

ప్రపంచ దేశాల మధ్య భారత్ ఇప్పుడు ఒక తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనలో కుదిరిన ఐదు కీలక ఒప్పందాలు భారత సైనిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి.

నేవీకి వెయ్యి ఏనుగుల బలం: రఫేల్-M

సముద్ర గర్భంలో శత్రువుల ఆట కట్టించేందుకు భారత్ ‘రఫేల్-మెరైన్’ యుద్ధ విమానాలను రంగంలోకి దించుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై నుంచి ఇవి గాలిలోనూ, నీటిపై ఉన్న శత్రువులను ఏకకాలంలో మట్టుబెట్టగలవు. ఈ 26 అత్యాధునిక జెట్ల రాకతో హిందూ మహాసముద్రంలో చైనా నౌకల కదలికలకు బ్రేక్ పడనుంది.

కొండల్లో దాక్కున్నా వదలని ‘హ్యామర్’ మిసైల్స్

భారత్-చైనా సరిహద్దుల్లోని కఠినమైన వాతావరణంలో యుద్ధం చేయడం ఇకపై భారత్‌కు సులువు కానుంది. ఫ్రాన్స్ సహకారంతో దేశీయంగా తయారవుతున్న ‘హ్యామర్’ మిసైల్స్ పిన్-పాయింట్ ఆక్యూరసీతో శత్రువుల బంకర్లను ధ్వంసం చేస్తాయి. రఫేల్, తేజస్ విమానాల ద్వారా వీటిని ప్రయోగించే అవకాశం ఉండటం మన ఎయిర్ ఫోర్స్‌కు కొండంత అండ.

రాడార్లకు చిక్కని స్కార్పీన్ సబ్ మెరైన్లు

సముద్రం అడుగున నిశ్శబ్దంగా ఉంటూ శత్రువును వేటాడటంలో స్కార్పీన్ జలాంతర్గాములు దిట్ట. ఇప్పటికే ఆరు సబ్ మెరైన్లు సిద్ధం కాగా, మరిన్ని అధునాతన జలాంతర్గావుల తయారీపై చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఎక్కువ రోజులు నీటి అడుగునే ఉండి శత్రువుల కదలికలను పసిగట్టగలవు.

ఆకాశమే హద్దుగా టాటా-ఎయిర్‌బస్ హెలికాప్టర్లు

కర్ణాటక వేదికగా టాటా, ఎయిర్‌బస్ సంస్థలు సంయుక్తంగా H125 రకం హెలికాప్టర్లను తయారు చేస్తున్నాయి. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులోనూ ఇవి సునాయాసంగా ప్రయాణించగలవు. ఇవి సైనిక అవసరాలకే కాకుండా, విపత్తు సమయాల్లోనూ కీలక పాత్ర పోషించనున్నాయి.

హైదరాబాద్‌లో గ్లోబల్ ఇంజన్ హబ్

ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్‌లో భారీ ఇంజన్ మెయింటెనెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏటా 300 విమాన ఇంజన్లను రిపేర్ చేసే సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో మన సొంత ఫైటర్ జెట్ల కోసం శక్తివంతమైన ఇంజన్లను ఫ్రాన్స్ సహకారంతో ఇక్కడే తయారు చేసుకోబోతున్నాం.

చైనా, పాక్ భయానికి కారణం ఇదే

కేవలం ఆయుధాలు కొనడమే కాకుండా, ఆ టెక్నాలజీని కూడా భారత్ సొంతం చేసుకోవడం డ్రాగన్ కంట్రీకి మింగుడుపడటం లేదు. హిమాలయ సరిహద్దుల నుంచి హిందూ మహాసముద్రం వరకు భారత్ తన పట్టును బిగించడంతో, పాకిస్థాన్, చైనాలు ఇప్పుడు రక్షణలో పడ్డాయి. ఈ ఐదు ఒప్పందాలు భారత్‌ను గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా మారుస్తాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నేటి టెక్నాలజీ యుగంలో భారత్ తీసుకుంటున్న ఈ అడుగులు దేశ భద్రతను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *