ట్రంప్ ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యా నుండి భారత్ భారీగా చమురు దిగుమతి
December 17, 2025

రష్యా చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలను అధిగమిస్తూ భారత్ రష్యా మధ్య వాణిజ్యం కొనసాగుతోంది. డిసెంబర్లో భారత్ రష్యా నుండి రోజుకు సుమారు 15 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల పరిధిలోకి రాని రష్యన్ కంపెనీల ద్వారా భారతీయ రిఫైనరీలు ఈ కొనుగోళ్లు జరుపుతున్నాయి.
ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ మధ్య ఉన్న బలమైన దౌత్య సంబంధాలే ఈ వాణిజ్యానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే బ్యారెల్కు 6 డాలర్లు తక్కువగా లభిస్తుండటంతో, పాశ్చాత్య దేశాల ఒత్తిడిని పక్కన పెట్టి భారత ప్రభుత్వ రంగ సంస్థలు రష్యా నుండి ముడి చమురు దిగుమతులను ముమ్మరం చేశాయి.