టీ20 ప్రపంచకప్‌పై సస్పెన్స్‌కు తెర దించిన పాకిస్థాన్

టీ20 ప్రపంచకప్‌పై సస్పెన్స్‌కు తెర దించిన పాకిస్థాన్

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే విషయంలో నెలకొన్న అనిశ్చితికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముగింపు పలికింది. బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మధ్య జరిగిన భేటీ తర్వాత, పాక్ జట్టు టోర్నమెంట్‌లో ఆడుతుందని అధికారికంగా ప్రకటించారు. ఏ మ్యాచ్‌ను బహిష్కరించబోమని, అన్ని మ్యాచ్‌లలో పాల్గొంటామని వారు స్పష్టం చేశారు.

ఒకవేళ టోర్నీని బహిష్కరిస్తే ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో పాక్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాక్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ మార్చి 8న ముగియనుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *