ఝాన్సీలో యువతి పట్ల అసభ్య ప్రవర్తన సిసిటివి ఫుటేజీలో బయటపడ్డ నిందితుల ఆగడాలు
December 17, 2025

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో మహిళా భద్రతపై ఆందోళన కలిగిస్తూ ఒక యువతిపై జరిగిన వేధింపుల వీడియో వైరల్ అవుతోంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు సదరు యువతిని అసభ్యంగా తాకి పారిపోవడం సిసిటివి కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. మహిళల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు.
This video is from Jhansi, Uttar Pradesh. This incident of a girl being harassed outside her home, After the incident was captured on CCTV, the family filed a police complaint. The police arrested both the accused, and broke their legs. pic.twitter.com/0Q0SR59mAd
— VARAHA WARRIOR (@VarahaWarrior) December 16, 2025