జుట్టు రాలడం మరియు బట్టతల సమస్యలకు చెక్ పెట్టే జపాన్ వింత ఆలయం ఇక్కడ పూజ చేస్తే జుట్టు పెరుగుతుందట
December 18, 2025

జపాన్‌లోని క్యోటో నగరంలో ఉన్న ‘మికామి ష్రైన్’ అనే ఆలయం తన వినూత్న సంప్రదాయంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 1960లో నిర్మించబడిన ఈ ఆలయం జపాన్ మొదటి హెయిర్ డ్రస్సర్ ఫుజివారా ఉనెమెనోసుకే మసయుకి జ్ఞాపకార్థం వెలసింది. సంపద లేదా విజయం కోసం కాకుండా, కేవలం తమ జుట్టు ఆరోగ్యంగా ఉండాలని భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు.
భక్తులు ‘కంపాట్సు’ అనే ప్రక్రియలో భాగంగా తమ జుట్టులోని ఒక చిన్న భాగాన్ని కవరులో ఉంచి పూజారికి అందజేస్తారు. షింటో పూజారి ఆ జుట్టుపై ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదిస్తారు. కేవలం సాధారణ ప్రజలే కాకుండా, బార్బర్లు మరియు హెయిర్ స్టైలిస్టులు కూడా తమ వృత్తిలో రాణించాలని ఈ వింత ఆలయాన్ని సందర్శిస్తుంటారు.