జుట్టు రాలడం ఆపి, త్వరగా పెంచే మునగాకు: రసమా, పొడరా— ఏది అత్యంత ప్రభావవంతం?
December 14, 2025

కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం చాలామంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. రసాయన ఉత్పత్తులకు బదులుగా, జుట్టు సంరక్షణ కోసం మునగాకును (Moringa) ఉపయోగించమని బ్యూటీ నిపుణులు సూచిస్తున్నారు. మునగలో విటమిన్ ఎ, సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, ఐరన్ మరియు యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీఫంగల్ గుణాలు ఉన్నాయి, ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేసి, వేగంగా పెరగడానికి దోహదపడతాయి.
మునగాకును నేరుగా పేస్ట్ చేసి రసం తీసి తాగడం అత్యధిక పోషకాలను అందిస్తుంది. సమయం తక్కువగా ఉన్నవారు ఆకులను ఎండబెట్టి, పొడి చేసి గోరువెచ్చని నీరు, స్మూతీ లేదా టీలో కలుపుకొని తాగవచ్చు. మునగాకు రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.