జర్మనీలో భారతీయ విద్యార్థి విషాదాంతం సంక్రాంతికి వస్తాడనుకుంటే విగతజీవిగా తల్లీదండ్రుల ఆవేదన

జర్మనీలో ఎంఎస్ చదువుతున్న 25 ఏళ్ల భారతీయ విద్యార్థి తోకల రితిక్ రెడ్డి అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. బెర్లిన్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో ప్రాణరక్షణ కోసం ఆయన పై అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంక్రాంతి పండుగకు ఇంటికి వస్తాడనుకున్న రితిక్ ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలంగాణకు చెందిన రితిక్ 2023లో ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లారు. ఆయన మృతదేహాన్ని త్వరితగతిన స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరారు. మరోవైపు, అమెరికాలోని న్యూయార్క్‌లో కూడా సహజ రెడ్డి అనే విద్యార్థిని అగ్నిప్రమాదంలో మరణించడం ప్రవాస భారతీయులను కలచివేస్తోంది. జర్మనీ అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు.