చనిపోయిన కూతురు 2 నెలల తర్వాత తిరిగొచ్చి చెప్పిన సంచలన నిజం- ‘కాల్చలో పడేసింది తల్లి, తండ్రి నిర్దోషి’

చనిపోయిన కూతురు 2 నెలల తర్వాత తిరిగొచ్చి చెప్పిన సంచలన నిజం- ‘కాల్చలో పడేసింది తల్లి, తండ్రి నిర్దోషి’

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ప్రేమ వ్యవహారానికి అడ్డు చెప్పి 17 ఏళ్ల కూతురిని కాళ్లు, చేతులు కట్టేసి కాలువలో పడేసిన కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. అక్టోబర్‌లో ఈ ఆరోపణపై తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక కనిపించకుండా పోవడంతో చనిపోయిందని భావించారు. అయితే, 2 నెలల తర్వాత ఆ ‘మరణించిన’ బాలిక అకస్మాత్తుగా తిరిగి వచ్చి, తన తండ్రి నిర్దోషి అని, కాలువలో పడేసినందుకు ప్రధాన నిందితురాలు తన తల్లేనని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.

స్థానిక మీడియాతో మాట్లాడిన ఆ బాలిక, తండ్రి ఈ పని చేయడానికి తల్లి ప్రేరేపించిందని చెప్పింది. తన తండ్రిని విడుదల చేసి, తల్లిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తాను ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాననే విషయంపై మాత్రం ఆమె వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. బాలిక వాంగ్మూలం ఇచ్చి, వైరల్ వీడియోను ధృవీకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఫిరోజ్‌పూర్ ఎస్‌ఎస్‌పి భూపిందర్ సింగ్ సిధు తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *