గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ముకేశ్ అంబానీ, సామాన్యుల డిజైటల్ భద్రతపై కీలక నిర్ణయం

గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ముకేశ్ అంబానీ, సామాన్యుల డిజైటల్ భద్రతపై కీలక నిర్ణయం

న్యూస్ డెస్క్ : మీ ఇంటర్నెట్ వాడకం ఇకపై మరింత సురక్షితం కానుంది. ముకేశ్ అంబానీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్, గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచస్థాయి 15 దిగ్గజ సంస్థలతో కలిసి ‘ట్రస్టెడ్ టెక్ అలయన్స్’ను ఏర్పాటు చేసింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం వల్ల సామాన్య ప్రజల డేటా గోప్యత మరియు డిజిటల్ భద్రత మెరుగుపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సైబర్ ముప్పులను అరికట్టడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశ్యం.

క్లౌడ్ కంప్యూటింగ్ నుండి సాఫ్ట్‌వేర్ సేవల వరకు అన్నింటా పారదర్శకతను పెంచడం ద్వారా వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందుతాయి. ఈ అంతర్జాతీయ కూటమిలో జియో భాగస్వామ్యం కావడం వల్ల భారత డిజిటల్ రంగం ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతం కానుంది. దీనివల్ల సామాన్యులకు భరోసాతో కూడిన సురక్షితమైన ఇంటర్నెట్ అనుభవం లభిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *