గుజరాత్‌లో రిజిస్టర్ మ్యారేజ్‌కు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం

గుజరాత్‌లో రిజిస్టర్ మ్యారేజ్‌కు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం

ప్రేమ వివాహాల పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు గుజరాత్ ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఇకపై రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి అని హోం మంత్రి హర్ష్ సంఘ్వి అసెంబ్లీలో ప్రకటించారు. యువతుల రక్షణ కోసమే ఈ చట్ట సవరణ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న 30 రోజులలోపు తల్లిదండ్రుల అభిప్రాయాన్ని రిజిస్ట్రార్ కార్యాలయం సేకరిస్తుంది. ఈ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతించగా, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాతే ఈ ప్రతిపాదనను చట్టంగా మారుస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *