గల్ఫ్ దేశాల్లో భారతీయులను రఫీక్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
December 18, 2025

సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలలో భారత్, పాకిస్థాన్ వలసదారులను తరచుగా ‘రఫీక్’ అని సంబోధిస్తుంటారు. అరబిక్ భాషలో దీని అర్థం ‘స్నేహితుడు’. 1970ల కాలంలో కార్మికుల సంఖ్య భారీగా ఉండటంతో, వారి పేర్లు గుర్తుంచుకోలేక యజమానులు అందరినీ కలిపి ఈ సాధారణ పేరుతో పిలవడం ప్రారంభించారు. ఇది క్రమంగా ఒక సామాజిక అలవాటుగా మారింది.
ఒకప్పుడు ఈ సంబోధన వెనుక కొంత వ్యంగ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇది గౌరవప్రదమైన పిలుపుగానే చలామణిలో ఉంది. మన దేశంలో అపరిచితులను ‘భాయ్ సాబ్’ అని పిలిచినట్లే, గల్ఫ్‌లో ఎదుటివారిని మర్యాదగా పలకరించడానికి ‘రఫీక్’ లేదా ‘సదీక్’ అనే పదాలను వాడుతున్నారు. భారత్-గల్ఫ్ దేశాల మధ్య పెరుగుతున్న సత్సంబంధాలు ఈ మార్పుకు ప్రధాన కారణం.