గర్భిణిని కొండపైనుంచి తోసి హత్య చేసిన భర్త! చనిపోయే ముందు భార్య చెప్పిన మాటలతో జైలుకు వెళ్ళిన భర్త
September 20, 2025

స్కాట్లాండ్‌లోని ఒక కోర్టు, తన గర్భిణీ భార్యను హత్య చేసిన కేసులో కాషిఫ్ అన్వర్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఎడిన్‌బర్గ్‌లోని ప్రసిద్ధ ‘ఆర్థర్ సీట్’ కొండపై అన్వర్ తన 17 వారాల గర్భిణీ భార్య అయిన ఫాజియా జావేద్‌ను 50 అడుగుల కిందకు తోసేశాడు. శాశ్వతంగా ఆమె నుండి విముక్తి పొందవచ్చని అతను భావించాడు. అయితే, ఆమె చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్, అన్వర్ నేరాన్ని బయటపెట్టింది.
దర్యాప్తులో, ఫాజియా అన్వర్‌తో విడిపోవాలనుకుందని, దీంతో అతను కోపంతో ఈ నేరానికి పాల్పడ్డాడని తెలిసింది. కోర్టులో, అన్వర్ ఇది ఒక ప్రమాదమని వాదించాడు. కానీ, సాక్షులు, పోలీసుల స్టేట్‌మెంట్‌లు అతని కథనాన్ని పూర్తిగా తప్పు అని నిరూపించాయి. చివరికి, కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి, కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.