క్రీడా రంగానికి బడ్జెట్ ఊతం పదివేల కోట్లతో నిర్మలమ్మ ప్రకటన
February 1, 2026

కేంద్ర బడ్జెట్ 2026లో భారత క్రీడా రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఖేలో ఇండియా మిషన్’ను ప్రకటించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ల అభివృద్ధికి మరియు భారత్‌ను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు రూ.10,000 కోట్ల భారీ నిధిని కేటాయించారు. ఈ నిధుల ద్వారా దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
‘మేక్ ఇన్ ఇండియా’ కింద స్వదేశీ క్రీడా పరికరాల తయారీకి ప్రాధాన్యతనిస్తూ స్పోర్ట్స్ స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించారు. దీనివల్ల క్రీడాకారులపై ఉండే ఆర్థిక భారం తగ్గడంతో పాటు వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందుబాటులోకి వస్తుంది. ఈ నిర్ణయాలు భారతీయ క్రీడాకారులు ప్రపంచ వేదికపై తమ ప్రతిభను చాటుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి.