కోల్‌కతా నౌకాశ్రయంలో సింగపూర్ షిప్ నుండి గంగలోకి దూకి శ్రీలంక నావికుడు మృతి
February 13, 2026

సింగపూర్ నుండి చిట్టగాంగ్ మీదుగా కోల్‌కతా చేరుకున్న కోట దునియా కంటైనర్ షిప్ నుండి ఒక శ్రీలంక నావికుడు గంగా నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్ధరాత్రి ఎన్ఎస్ డాక్ సమీపంలో సహోద్యోగుల కళ్లముందే ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే కోల్‌కతా పోర్ట్ అధికారులు మరియు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
లాల్‌బజార్ కంట్రోల్ రూమ్ ఆదేశాలతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి నావికుడి మృతదేహాన్ని వెలికితీశారు. వెస్ట్ పోర్ట్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతను నదిలోకి ఎందుకు దూకాడనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.