కోడలి అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించిన మామను పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన దుండగులు
February 1, 2026

తమిళనాడులోని కడలూరు జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. 70 ఏళ్ల వృద్ధ రైతు రాజేంద్రన్ సైకిల్‌పై వెళ్తుండగా కొందరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ అమానుష దృశ్యాలు సమీపంలోని సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం రాజేంద్రన్ కోడలికి మణికంఠన్ అనే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధాన్ని ఆయన వ్యతిరేకించడమే ఈ హత్యకు కారణమని తేలింది. దీంతో ఆగ్రహానికి గురైన మణికంఠన్ తన అనుచరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కోడలు మరియు ప్రధాన నిందితుడితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.