కోట్ల ఆస్తులు ఉన్నా తీహార్ జైలు పాలైన ప్రముఖ నటుడు రాజ్‌పాల్ యాదవ్

కోట్ల ఆస్తులు ఉన్నా తీహార్ జైలు పాలైన ప్రముఖ నటుడు రాజ్‌పాల్ యాదవ్

బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ 9 కోట్ల రూపాయల రుణ వివాదంలో చిక్కుకుని ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న అప్పు తీర్చకపోవడం మరియు చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో ఆయన ఫిబ్రవరి 5న పోలీసులకు లొంగిపోయారు.

ప్రతి సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే రాజ్‌పాల్ యాదవ్ ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఫిబ్రవరి 19న ఇంట్లో శుభకార్యం ఉన్న నేపథ్యంలో ఆయన విడుదల ఇప్పుడు పూర్తిగా కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *