కొత్త ఏడాది వేళ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనంలో కీలక మార్పులు వీఐపీ దర్శనాలు రద్దు

కొత్త ఏడాది వేళ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనంలో కీలక మార్పులు వీఐపీ దర్శనాలు రద్దు

కొత్త సంవత్సరం మరియు 2025 ముగింపు సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి పోటెత్తే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుండి జనవరి 4 వరకు వీఐపీ మరియు ప్రత్యేక దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసింది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ రోజుల్లో ఆలయం తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.

ఈ ఆరు రోజుల పాటు భక్తులందరూ సాధారణ క్యూ లైన్ల ద్వారానే స్వామివారిని దర్శించుకోవాలని ట్రస్ట్ స్పష్టం చేసింది. రద్దీ కారణంగా దర్శనానికి 3 నుండి 4 గంటల సమయం పట్టవచ్చని, భక్తుల సౌకర్యార్థం తాగునీరు మరియు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు సహనంతో వ్యవహరించి ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనం చేసుకోవాలని ఆలయ యంత్రాంగం కోరింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *