కొడుకు ప్రైవేట్ లెటర్ చదివినందుకు తండ్రికి 2 ఏళ్లు జైలు, ₹2.33 లక్షల జరిమానా!

స్పెయిన్‌లోని సెవిల్లెలో సంచలనం సృష్టించిన ఈ కేసులో, 10 ఏళ్ల కొడుకు రాసిన ప్రైవేట్ లెటర్‌ను అతని అనుమతి లేకుండా చదివినందుకు ఒక తండ్రికి కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష, ₹2.33 లక్షల (యూరో) జరిమానా విధించింది. అబ్బాయి పిన్ని రాసిన ఆ లేఖలో, తండ్రి తల్లితో దురుసుగా ప్రవర్తించే విధానం, అతడి నేరాలను ఎలా నిరూపించాలనే విషయాలు ఉన్నాయి. ఈ గోప్య లేఖను రహస్యంగా చదివినందుకు తండ్రిని కొడుకు వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించినట్లు న్యాయస్థానం నిర్ధారించింది.
లేఖ అనుకోకుండా తెరుచుకుందని, పిన్ని కొడుకును రెచ్చగొడుతుందని తండ్రి కోర్టులో వాదించారు. అయినప్పటికీ, న్యాయస్థానం ఆ వాదనలన్నింటినీ తోసిపుచ్చింది. సంరక్షకుడైనప్పటికీ, లేఖను తెరవడానికి ముందు తండ్రి కొడుకు అనుమతి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు వ్యక్తిగత గోప్యత హక్కు, దాని చట్టపరమైన రక్షణ ప్రాముఖ్యతను బలంగా నొక్కిచెబుతోంది.