కేక్ తిన్న విరాట్, సిరీస్ గెలిచాక స్వీట్‌ను తిరస్కరించిన రోహిత్- ఫిట్‌నెస్ విషయంలో ఎవరు సీరియస్!

‘ఫిట్‌నెస్ ఫ్రీక్’గా సుదీర్ఘ కాలంగా పేరున్న విరాట్ కోహ్లీ, సిరీస్ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో యశస్వి జైస్వాల్ ఇచ్చిన కేక్‌ను సంతోషంగా తిన్నారు. అయితే, ఒకప్పుడు ఫిట్‌నెస్‌పై పెద్దగా శ్రద్ధ చూపని రోహిత్ శర్మ మాత్రం ఊహించని విధంగా కేక్‌ను తినడానికి నిరాకరించారు. యశస్వి ఆయనకు కేక్ తినిపించడానికి వెళ్లగా, ‘హిట్‌మ్యాన్’ సరదాగా, “నేను లావైపోతాను…” అని చెప్పడం డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ సిరీస్‌లో కోహ్లీ బ్యాట్ నుండి పరుగుల వరద పారడంతో, ఉత్సాహంలో ఆయన కాస్త మినహాయింపు తీసుకున్నారు. దీనికి విరుద్ధంగా, ఇటీవల 10 కిలోలకు పైగా బరువు తగ్గిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కఠినమైన ఆహార నియమాలు (Strict Diet) పాటిస్తున్నారు. ఆయన కేక్‌ను తిరస్కరించడం 2027 ప్రపంచ కప్ కోసం తన ఫిట్‌నెస్ లక్ష్యాల పట్ల ఎంత సీరియస్‌గా ఉన్నారో స్పష్టం చేస్తోంది.