కింగ్‌ఫిషర్ ఉద్యోగులకు భారీ ఊరట పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ బకాయిల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్

కింగ్‌ఫిషర్ ఉద్యోగులకు భారీ ఊరట పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ బకాయిల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఉద్యోగులకు ఎట్టకేలకు ఊరట లభించింది. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు, ఇతర బకాయిల కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చొరవతో రూ. 311.67 కోట్లు విడుదల కానున్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద జప్తు చేసిన షేర్లను విక్రయించడం ద్వారా ఈ నిధులను సేకరించారు. ఈ మొత్తాన్ని అఫీషియల్ లిక్విడేటర్‌కు అప్పగించాలని డిసెంబర్ 12న చెన్నైలోని డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ (DRT-I) కీలక ఆదేశాలు జారీ చేసింది.

విజయ్ మాల్యాకు చెందిన దాదాపు రూ. 5,042 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గతంలోనే జప్తు చేసింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం విజ్ఞప్తి మేరకు ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కోర్టు అనుమతించింది. ఈడీ ఇప్పటికే రూ. 14,132 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు తిరిగి ఇప్పించగా, తాజాగా విడుదల చేసిన రూ. 311 కోట్లు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వేలాది మంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చాయి. నేరగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను బాధితులకు చేర్చడంలో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలిచింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *