కన్నతండ్రి గొంతు కోసి చంపిన కుమార్తెలు ఉత్తరప్రదేశ్ లో దారుణం
February 24, 2026

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోర్నా గ్రామంలో దారుణం జరిగింది. తమను చిన్నచూపు చూస్తున్నాడన్న కోపంతో ఇద్దరు కుమార్తెలు కలిసి తండ్రి రాంప్రసాద్‌ను కిరాతకంగా హత్య చేశారు. సోమవారం తెల్లవారుజామున రాంప్రసాద్ తన గదిలో రక్తపు మడుగులో శవమై కనిపించగా, పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తులు చంపారని కుటుంబ సభ్యులు నమ్మించే ప్రయత్నం చేసినా పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.
తండ్రి తమను ఎప్పుడూ తిడుతూ కొడుకులకే ప్రాముఖ్యత ఇస్తున్నాడని ఆగ్రహించిన కుమార్తెలు, ఆదివారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన గొంతు కోసి హత్య చేశారు. అనంతరం రక్తపు మరకలున్న బట్టలను గడ్డివాములో దాచిపెట్టారు. మృతుడి కుమారుడు అమిత్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.