ఓలా మరియు ఉబెర్ సంస్థలకు గట్టి పోటీనిచ్చే అమిత్ షా భారత్ టాక్సీ
February 23, 2026

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో డ్రైవర్లతో సమావేశమై భారత్ టాక్సీ సేవలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సహకార రంగంలో ప్రారంభమైన ఈ సేవల్లో డ్రైవర్లే యజమానులని, ఈ వ్యవస్థ పూర్తిగా స్థిరపడటానికి మూడేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. అంతవరకు డ్రైవర్లు ఓపికతో పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
అముల్ మరియు నాబార్డ్ సహకారంతో నడుస్తున్న ఈ యాప్ ఆధారిత సేవల్లో డ్రైవర్ల నుండి ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. ప్రైవేట్ సంస్థల వలె పీక్ అవర్ ఛార్జీలు ఉండవని, త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.