ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత యువ కిరటాల హవా.. టాప్ 10లోకి దూసుకొచ్చిన ఇషాన్ కిషన్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. బ్యాటింగ్ విభాగంలో యువ సెన్సేషన్ అభిషేక్ శర్మ 891 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, గత రికార్డుల ఆధారంగా అతను అగ్రస్థానంలోనే కొనసాగుతుండటం విశేషం. ఇక టీ20 ప్రపంచకప్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ ఏకంగా ఎనిమిదో స్థానానికి ఎగబాకి టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు.
టాప్ ర్యాంకుల్లో మనోళ్లే బ్యాటింగ్ విభాగంలో ఫిల్ సాల్ట్ (808) రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆటగాడు పాతున్ నిశాంక (786) మూడో స్థానానికి చేరుకున్నాడు. భారత్ నుంచి తిలక్ వర్మ (751) నాలుగో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో నిలిచి తమ పట్టు నిలుపుకున్నారు.
బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ బౌలింగ్ విభాగంలో భారత్‌కు తిరుగులేని విజయం లభించింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అద్భుత ప్రదర్శనతో ఐసీసీ నంబర్ వన్ టీ20 బౌలర్‌గా అవతరించాడు. రషీద్ ఖాన్ (740), అబ్రార్ అహ్మద్ (734) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ఆల్‌రౌండర్లలోనూ సత్తా చాటుతున్న పాండ్య, దూబే ఆల్‌రౌండర్ల జాబితాలో స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య మూడో స్థానంలో కొనసాగుతుండగా, శివమ్ దూబే తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. బ్యాట్ మరియు బాల్‌తో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఇద్దరూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు.
ఓవరాల్‌గా టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే జోరు కొనసాగితే రాబోయే టోర్నీల్లో భారత్‌ను అడ్డుకోవడం ప్రత్యర్థి జట్లకు దాదాపు అసాధ్యమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.