ఏపీ పల్లెల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ విప్లవం భారత్ నెట్ ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం

ఏపీ పల్లెల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ విప్లవం భారత్ నెట్ ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను పరుగులు తీయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం జరిగింది. సుమారు రూ.2,432 కోట్ల నిధులతో చేపట్టనున్న ‘అమెండెడ్ భారత్ నెట్’ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని 5 లక్షల గ్రామీణ ఇళ్లకు హైస్పీడ్ ఫైబర్ కనెక్టివిటీ అందనుంది. దీనివల్ల పల్లెల్లో ఇంటర్నెట్ వేగం పెరిగి డిజిటల్ మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 13,426 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఇందుకోసం ‘ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. రెండు దశల్లో నెట్ వర్క్ అప్‌గ్రేడ్ చేయడంతో పాటు కొత్తగా ఏర్పడిన 480 పంచాయతీలకు కూడా బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తారు. ఈ డిజిటల్ విప్లవం ద్వారా ఆన్‌లైన్ విద్య, టెలీమెడిసిన్, ఈ-గవర్నెన్స్ సేవలు సామాన్యులకు చేరువవడమే కాకుండా, విద్యార్థులు మరియు నిరుద్యోగులకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *