ఏఐ యాప్స్ వాడుతున్నారా అయితే మీ డేటా ప్రమాదంలో ఉన్నట్లే

ఏఐ యాప్స్ వాడుతున్నారా అయితే మీ డేటా ప్రమాదంలో ఉన్నట్లే

గూగుల్ ప్లే స్టోర్‌లోని ఏఐ యాప్స్ ద్వారా లక్షలాది మంది వినియోగదారుల డేటా లీక్ అయినట్లు పరిశోధకులు గుర్తించారు. వీడియో ఏఐ ఆర్ట్ జనరేటర్ యాప్ ద్వారా సుమారు 12 టీబీ డేటా మరియు 82 లక్షల ఫైల్స్ బహిర్గతమయ్యాయి. క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లోపల వల్ల ఫోటోలు మరియు వీడియోలు అపరిచితుల చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం.

ఐడీ మెరిట్ యాప్ ద్వారా కేవైసీ వివరాలు కూడా లీక్ కావడంతో యూజర్ల ఆధార్, ఫోన్ నంబర్లు ప్రమాదంలో పడ్డాయి. కోడ్‌వే అనే డెవలపర్ రూపొందించిన ఈ యాప్స్ వల్ల అంతర్జాతీయంగా లక్షలాది మంది ప్రభావితమయ్యారు. తెలియని యాప్స్ డౌన్లోడ్ చేసే ముందు వాటి రేటింగ్స్ మరియు డెవలపర్ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *