ఎంబీఏ చదివి ఏఐతో గంజాయి సాగు! ఫ్లాట్‌లోనే డ్రగ్ ఫ్యాక్టరీ.. పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యే స్కెచ్
December 18, 2025

పుణెలోని హింజేవాడిలో అత్యంత ఆధునిక డ్రగ్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఎంబీఏ పట్టభద్రులైన సుమిత్ దేద్వాల్, అక్షయ్ మెహర్ తమ ఫ్లాట్‌ను ఏఐ (AI) ఆధారిత హైటెక్ ల్యాబ్‌గా మార్చేశారు. మట్టి లేకుండా కేవలం నీటితో పండించే ‘హైడ్రోపోనిక్’ పద్ధతిలో ఖరీదైన ‘OG-Kush’ గంజాయిని సాగు చేస్తున్నారు. ఉష్ణోగ్రత, తేమను నియంత్రించడానికి వీరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం గమనార్హం.
వీరు డార్క్ వెబ్ ద్వారా థాయ్‌లాండ్ నుండి విత్తనాలను తెప్పించుకుంటూ, పోలీసులకు చిక్కకుండా క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు జరిపేవారు. ఈ దాడుల్లో ముంబై, పుణె ప్రాంతాల నుండి సుమారు 3.25 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు ముంబైకి చెందిన మరో ఇద్దరు సరఫరాదారులను కూడా అరెస్ట్ చేశారు.