ఉదయం టిఫిన్ మానేస్తున్నారా? దీనివల్ల ఆరోగ్యానికి వచ్చే ముప్పు ఎంత
February 22, 2026

న్యూస్ డెస్క్ : ఉదయం అల్పాహారం తీసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుందనేది పాత మాట అని హైదరాబాద్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ చెబుతున్నారు. మీరు క్రమబద్ధమైన జీవనశైలిని పాటిస్తూ, మిగిలిన సమయాల్లో పోషకాహారం తీసుకుంటే టిఫిన్ మానేయడం వల్ల పెద్దగా నష్టం ఉండదు. ఇది మీ శరీర మెటబాలిజంను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఇది అందరికీ వర్తించదు.
నియంత్రణ లేని అలవాట్ల వల్ల టిఫిన్ మానేస్తే సాధారణ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గర్భిణులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు కష్టపడి పనిచేసేవారు ఉదయం పూట ఖాళీ కడుపుతో ఉంటే నీరసం, తల తిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఆకలితో జంక్ ఫుడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది. కాబట్టి మీ శరీర అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.