ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ భయం తక్షణమే దేశం విడిచి వెళ్లాలని భారతీయులకు రాయబార కార్యాలయం ఆదేశం
February 23, 2026

ఇరాన్ మరియు అమెరికా మధ్య అణు ఒప్పందంపై వివాదం ముదిరి యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా తన యుద్ధనౌకలను మోహరించగా, ఇరాన్ కూడా దీటుగా స్పందించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
పరిస్థితిని గమనించిన భారత రాయబార కార్యాలయం, ఇరాన్‌లోని భారతీయులు అందుబాటులో ఉన్న విమానాల ద్వారా వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని సూచించింది. సహాయం కోసం రాయబార కార్యాలయ ఈమెయిల్‌ను సంప్రదించాలని కోరుతూ, జనవరి 14, 2026న జారీ చేసిన ముందస్తు భద్రతా సూచనలను మరోసారి గుర్తు చేసింది.