ఇరాన్‌లో అధికార మార్పిడే మార్గం ట్రంప్ హెచ్చరికలతో ముదురుతున్న మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు
February 14, 2026

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో ఇరాన్ ప్రస్తుత మత నాయకత్వాన్ని మార్చడమే సరైన పరిష్కారమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కరోలినాలో సైనికులతో మాట్లాడిన ఆయన దౌత్యపరమైన చర్చలతో పాటు సైనికపరంగా కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అవసరమైతే శక్తిని ప్రదర్శించేందుకు వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ను అరేబియా సముద్రం వైపు పంపాలని ట్రంప్ ఆదేశించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చల అనంతరం ఒక నెలలోపు ఎలాంటి ఒప్పందం కుదరకపోతే అమెరికా కఠిన చర్యలు తీసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు.