అమెరికాలో పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా నేరం నిరూపణ
February 14, 2026

న్యూయార్క్‌లో ఖలిస్థానీ నేత గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నినట్లు 54 ఏళ్ల భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా అమెరికా కోర్టులో అంగీకరించారు. కిరాయి హంతకుడికి అడ్వాన్స్ చెల్లించడంతో పాటు మూడు తీవ్రమైన ఆరోపణలలో అతను దోషిగా తేలారు. మే 29న న్యాయమూర్తి విక్టర్ మారో ఈ కేసులో తుది శిక్షను ఖరారు చేయనున్నారు.
లక్ష డాలర్ల ఒప్పందంతో ఈ హత్యకు నిఖిల్ ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే అతను సంప్రదించిన వ్యక్తి అమెరికన్ ఏజెన్సీకి చెందిన రహస్య ఏజెంట్ అని వెల్లడైంది. ఈ నేరానికి అతనికి గరిష్టంగా 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి చర్యలు చేపట్టింది.