ఇరాన్‌లో అట్టుడుకుతున్న నిరసనలు కనుమరుగైన సుప్రీం లీడర్ ఖమేనీ తదుపరి వారసుడు ఎవరు
January 2, 2026

ఇరాన్‌లో ప్రభుత్వంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గత వారం రోజులుగా కనిపించకపోవడం సంచలనంగా మారింది. ఆయన అనారోగ్యంతో ఉన్నారని, ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షించే బాధ్యతను అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు అప్పగించారని వార్తలు వస్తున్నాయి. నిరసనకారులపై భద్రతా దళాల కాల్పుల్లో ఏడుగురు మరణించడంతో ఇరాన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో ఉంది.
ఖమేనీ మౌనం వహించడంతో ఆయన వారసుడి ఎంపికపై చర్చలు మొదలయ్యాయి. ఈ రేసులో ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ మరియు హుస్సేన్ ఖొమేనీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల మధ్య దేశంలో అంతర్గత తిరుగుబాటు తలెత్తడం, అత్యున్నత నాయకుడు అందుబాటులో లేకపోవడం ఇరాన్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.