ఇమ్రాన్ ఖాన్ హకీకి ఆజాదీ నినాదంతో దద్దరిల్లుతున్న పాకిస్థాన్
December 17, 2025

జైలు నుంచే ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన హకీకి ఆజాదీ నినాదం ఇప్పుడు పాకిస్థాన్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అడియాలా జైలులో ఇమ్రాన్‌ను ఎవరినీ కలవనీయకపోవడంతో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు.
హకీకి ఆజాదీ అంటే నిజమైన స్వాతంత్ర్యం అని అర్థం. చావుకైనా సిద్ధం కానీ బానిసత్వానికి కాదన్న ఇమ్రాన్ సందేశం ఇప్పుడు పీటీఐ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నినాదం ఇప్పుడు పాకిస్థాన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.