ఇమ్రాన్ ఖాన్‌కు నమ్మకస్తుడే శత్రువు? సాక్షిగా మారనున్న ఫైజ్ హమీద్, పాక్ రాజకీయాల్లో కీలక మలుపు

పాకిస్థాన్‌లో అధికారంలో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ అత్యంత విశ్వసించిన ఫైజ్ హమీద్ (నాటి ఐఎస్ఐ చీఫ్) ఇప్పుడు మాజీ ప్రధాని రాజకీయ శవపేటికలో చివరి మేకు కొట్టడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సైనిక కోర్టులో దోషిగా తేలిన తర్వాత, ఫైజ్ హమీద్ 2023 మే 9 నాటి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ సాక్షిగా మారే చర్చ ఊపందుకుంది. అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ఎంపీ ఫైసల్ బవడా దీనిని జియో న్యూస్‌తో ధృవీకరించారు. ఈ ప్రక్రియ త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.
పాకిస్తాన్ సైనిక కోర్టు ఫైజ్ హమీద్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది, ప్రస్తుతం ఆయన ఆర్మీ అదుపులో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన ఏకైక వ్యక్తి ఫైజ్ హమీద్. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ అధ్యాయాన్ని పూర్తిగా ముగించాలని పాకిస్తాన్ ఆర్మీ భావిస్తోంది. ఇప్పటివరకు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఆర్మీకి పెద్ద ఆధారాలు దొరకనందున, ఫైజ్ హమీద్ ప్రభుత్వ సాక్షిగా మారితే ఇమ్రాన్‌ను తటస్థీకరించడం సులభం అవుతుందని ఆర్మీ అంచనా వేస్తోంది.