ఆ జట్లు తలపడితే భారీ క్రేజ్: హర్భజన్ సింగ్
March 22, 2025

అంతర్జాతీయ క్రికెట్లో భారత్-పాక్ మ్యాచులకు ఏవిధంగా క్రేజ్ ఉంటుందో, ఐపీఎల్ ఈవెంట్ లో చెన్నై-ముంబయి మ్యాచులకు అలాంటి క్రేజ్ ఉంటుందని హర్భజన్ సింగ్ అన్నారు. రెండు జట్లలో టాప్ ప్లేయర్స్ ఉన్నారని, మంచి ఫ్యాన్ బేస్ ఉందని తెలిపారు. ధోనీ ఆటకోసం CSK ఫ్యాన్స్ ఏడాదిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటి యువ క్రికెటర్లలో రియాన్ పరాగ్ గేమ్ తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. రేపు చెన్నైలో MI-CSK తలపడనున్నాయి.