ఆస్తి కోసం కన్నతల్లిని చంపి పాతిపెట్టిన కొడుకు చివరకు ఏం చేసుకున్నాడో తెలుసా

ఆస్తి కోసం కన్నతల్లిని చంపి పాతిపెట్టిన కొడుకు చివరకు ఏం చేసుకున్నాడో తెలుసా

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా రేనాపూర్ పరిధిలో భూమి కోసం కన్నతల్లిని చంపి పూడ్చిపెట్టిన ఒక కుమారుడు ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. పొలం అమ్మే విషయంలో 80 ఏళ్ల తల్లి సమింద్రాబాయితో గొడవపడిన కాకాసాహెబ్ యాదవ్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా శవాన్ని చెరకు తోటలో పాతిపెట్టి ఆధారాలు మాయం చేసే ప్రయత్నం చేశాడు.

తల్లిని చంపిన కొద్ది గంటలకే నిందితుడు నిమ్మచెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా భూమి వివాదమే ఈ దారుణానికి కారణమని తేలింది. మరణించిన కుమారుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో ఒకే చితిపై తల్లి కొడుకులకు అంత్యక్రియలు నిర్వహించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *