ఆయుర్వేదానికి కేంద్రం పెద్దపీట దేశవ్యాప్తంగా మూడు కొత్త సంస్థల ఏర్పాటు
February 1, 2026

భారతీయ పురాతన వైద్య విధానానికి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆరోగ్య రంగంలో ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు దేశంలో కొత్తగా మూడు ‘ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద’ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆధునిక వైద్యంతో పాటు వైదిక కాలపు చికిత్సా పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
భారత్‌ను ప్రపంచ దేశాల ముందు ‘మెడికల్ వ్యాల్యూ టూరిజం హబ్’గా నిలబెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సంప్రదాయ భారతీయ వైద్య పద్ధతులను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని కూడా బలోపేతం చేయనున్నారు. ఈ నిర్ణయం దేశ ఆరోగ్య వ్యవస్థలో నూతన అధ్యాయానికి నాంది కానుంది.