ఆపరేషన్ సింధూర్: అర్ధరాత్రి ఎందుకు దాడి చేసింది? కారణం చెప్పిన సీడీఎస్

ఆపరేషన్ సింధూర్: అర్ధరాత్రి ఎందుకు దాడి చేసింది? కారణం చెప్పిన సీడీఎస్

‘ఆపరేషన్ సింధూర్’ సందర్భంగా భారత్ మొదటి దాడులను ఎందుకు అర్ధరాత్రి 1 గంటకు నిర్వహించిందో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వివరించారు. సరిహద్దుకు అవతలివైపు పౌర ప్రాణ నష్టాన్ని నివారించడమే దీని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఇది సాంప్రదాయ యుద్ధానికి భిన్నమైన ‘కొత్త రకం యుద్ధం’ అని, ఇందులో సాంకేతికత, వ్యూహాత్మక నిఘా కీలక పాత్ర పోషించాయని ఆయన చెప్పారు.

ఈ ఆపరేషన్లో భూమి, గాలి, సముద్రం, సైబర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పేస్ వంటి అనేక రంగాలలో పోరాటం జరిగింది. ఈ దాడులలో భారత్ పాకిస్తాన్‌ను ప్రతీ దశలోనూ నిర్ణయాత్మకంగా ఓడించిందని ఆయన నొక్కి చెప్పారు. ఈ యుద్ధం భూభాగాన్ని ఆక్రమించడం లేదా సైనికులను చంపడం గురించి మాత్రమే కాదని, సాంకేతిక ఆధిపత్యం, ఖచ్చితత్వాన్ని ప్రదర్శించడం అని ఆయన తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *