అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక కుట్ర ఉందా? కేంద్రం కీలక ప్రకటన

అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక కుట్ర ఉందా? కేంద్రం కీలక ప్రకటన

గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 260 మంది మరణించిన ఘటనపై ఇటలీకి చెందిన ఒక పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇది కేవలం ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని పేర్కొంది. ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది.

విదేశీ పత్రిక ప్రచురించిన కథనం కేవలం ఊహాజనితమని, దానికి ఎటువంటి ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని వెల్లడించింది. తుది నివేదిక రాకముందే ఎటువంటి అంచనాలకు రావద్దని, దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *