అరుదైన ఖనిజ అయస్కాంతాలపై చైనా గుత్తాధిపత్యానికి తెర! ఆత్మనిర్భర్ దిశగా భారత్ చారిత్రక అడుగు

అరుదైన ఖనిజ అయస్కాంతాలపై చైనా గుత్తాధిపత్యానికి తెర! ఆత్మనిర్భర్ దిశగా భారత్ చారిత్రక అడుగు

అరుదైన ఖనిజ అయస్కాంతాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రత్యేక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వ్యూహాత్మక అంశంలో చైనా ఏకఛత్రాధిపత్యం, ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత కీలకమైనది. ప్రాథమికంగా రూ. 7280 కోట్లు కేటాయించిన ‘స్క్రీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిన్టర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్’ పథకం ద్వారా దేశంలోనే అరుదైన ఖనిజాలను శుద్ధి చేసి, శక్తివంతమైన శాశ్వత అయస్కాంత పదార్థాలను తయారు చేయనున్నారు.

ఈ కొత్త పథకం కింద, మొదటి దశలో సంవత్సరానికి సుమారు 6,000 టన్నుల అరుదైన ఖనిజాలను ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలక్ట్రిక్ మోటార్లు, డ్రోన్లు, స్మార్ట్‌ఫోన్‌లు, రక్షణ పరికరాలతో సహా అత్యాధునిక పరిశ్రమలకు అత్యవసరమైన ఈ కీలక భాగంలో స్వావలంబన సాధించడం ద్వారా, దీర్ఘకాలంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని భారత్ బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం దాదాపు పూర్తిగా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో భారతదేశం ఒక ముఖ్యమైన ఎగుమతిదారుగా మారుతుందని న్యూఢిల్లీ ఆశాభావం వ్యక్తం చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *