అరబ్బీ సముద్రంలో అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ డ్రోన్ దాడి, యుద్ధ మేఘాలతో సామాన్యుల్లో గుబులు
February 4, 2026

న్యూస్ డెస్క్ : అరబ్బీ సముద్రంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి ప్రయత్నించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అంతర్జాతీయ జలాల్లో ఉన్న ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ పైకి దూసుకొచ్చిన ఈ డ్రోన్‌ను అమెరికా బలగాలు గాల్లోనే కూల్చివేసాయి. ఈ ఉద్రిక్తతలు గనక యుద్ధానికి దారితీస్తే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగి సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
అమెరికా తన దూకుడును తగ్గించుకోకపోతే మధ్యప్రాచ్యం అంతటా యుద్ధం తప్పదని ఇరాన్ అగ్రనేత హెచ్చరించారు. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్యం మరియు సరఫరా వ్యవస్థలను అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. అగ్రరాజ్యం అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం, రాబోయే రోజుల్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.