అమెరికన్ సైనికుల హత్య: ఐసిస్‌కు ప్రతీకారం తప్పదు! తీవ్ర హెచ్చరిక చేసిన ట్రంప్
December 15, 2025

సిరియాలోని చారిత్రక పాల్మైరా నగరంలో ఐఎస్‌ఐఎస్ (ISIS) జరిపిన దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులు, ఒక అమెరికన్ పౌరుడు మరణించారు. ఈ దాడిలో మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఐసిస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్లపై ఒక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. సంఘటనా స్థలంలో ఉన్న సీఐ సెక్యూరిటీ బలగాలు వెంటనే దాడి చేసిన వ్యక్తిని కాల్చిచంపినా, అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “సిరియాలో చనిపోయిన ముగ్గురు అమెరికన్ దేశభక్తుల మృతికి మేము సంతాపం తెలుపుతున్నాము. ఇది అమెరికాపై మాత్రమే కాదు, సిరియాపై కూడా ఐసిస్ చేసిన దాడి,” అని ఆయన అన్నారు. ఈ దాడికి కఠినమైన ప్రతీకారం తీర్చుకుంటామని, దీనికి బాధ్యులైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ట్రంప్ స్పష్టం చేశారు.