అమితాబ్‌ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే! 52 ఏళ్ల తర్వాత జయా బచ్చన్ చెప్పిన సంచలన విషయం!

ఇటీవలి ప్యానెల్ చర్చలో, ప్రముఖ నటి జయా బచ్చన్ తన వివాహ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యాన్ని వెల్లడించారు. 52వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న తర్వాత, భర్త అమితాబ్ బచ్చన్‌తో తన వ్యక్తిత్వంలో ఉన్న వ్యత్యాసాలే ఈ బంధానికి ప్రధాన కారణమని ఆమె తెలిపారు. అమితాబ్ బచ్చన్‌లో తనకు బాగా నచ్చిన విషయం ఆయనకున్న కఠినమైన క్రమశిక్షణ అని, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులంటే తనకు ఇష్టమని జయ అన్నారు.
అమితాబ్ మాదిరిగా తాను తక్కువ మాట్లాడే వ్యక్తిని కాదని, తన అభిప్రాయాలను తనలోనే ఉంచుకోనని జయ అన్నారు. అమితాబ్ మాట్లాడకపోయినా, సరైన సమయంలో సరైన రీతిలో చెప్పవలసిన విషయాన్ని చెబుతారని ఆమె వివరించారు. “మా ఇద్దరి వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నమైనవి, అందుకే నేను బహుశా ఆయనను పెళ్లి చేసుకున్నాను. నాలాగే ఉన్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకుని ఉంటే, ఒకరు బృందావనంలో, మరొకరు ఇంకెక్కడో ఉండేవాళ్ళం,” అని ఆమె చమత్కరించారు.