అభిషేక్ శర్మపై వేటు వేసి సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వనున్న టీమిండియా
February 23, 2026

దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి తర్వాత టీమిండియా మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయాలకు సిద్ధమైంది. వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మను పక్కన పెట్టి, అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన అభిషేక్ ఫామ్ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.
ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, రైట్-లెఫ్ట్ కాంబినేషన్ కోసం శాంసన్‌ను చేర్చడం వ్యూహాత్మకంగా అవసరమని కోచింగ్ స్టాఫ్ భావిస్తోంది. సెమీస్ చేరాలంటే జిల్బాబ్వే, వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌ల్లో భారత్ కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో రింకూ సింగ్, తిలక్ వర్మల ప్రదర్శనను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోష్ఛేట్ స్పష్టం చేశారు.